APSRTC Recruitment 2023 Notification ఏపియస్ఆర్టీసీ నుండి కండక్టర్, డ్రైవర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APSRTC Recruitment 2023 Notification :

APSRTC నుండి జూనియర్ కండక్టర్, అసిస్టెంట్, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, డ్రైవర్, శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపియస్ ఆర్టీసీ నందు 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల జీవితభాగస్వామి లేదా వారసులను 1168 పోస్టులను కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టుల్లో నియామకాలు చేపట్టారు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

మిగిలిన దరఖాస్తులను కలెక్టర్ల నుంచి జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు వెనక్కి తీసుకొని వారిని RTC ల్లో ఖాళీగా గల పోస్టులలో నియమించేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుళ్, డ్రైవర్, శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు కలిపి మొత్తం ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ ఎండీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.

APSRTC Jobs 2023

APSRTC Vacancy 2023 :

  • జూనియర్ అసిస్టెంట్లు – 34
  • ఆర్టీసీ కానిస్టేబుళ్లు – 146
  • కండక్టర్లు – 175
  • డ్రైవర్లు – 368
  • శామ్రిక్ లేదా అసిస్టెంట్ మెకానిక్లు – 445
  • మొత్తం పోస్టులు – 1,168

APSRTC Compassionate Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 నుండి 34 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
  • ఒకవేళ అభ్యర్థి మరణించిన ఉద్యోగి భాగస్వామి అయితే 45 ఏళ్ల వరకు వయోపరిమితి కల్పించారు.

మరిన్ని ఉద్యోగాలు సమాచారం :

విద్యార్హతలు :

జూనియర్‌ అసిస్టెంట్‌ :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఆర్టీసీ కానిస్టేబుల్ :

పదో తరగతి ఉత్తీర్ణత.

కండక్టర్‌ :

పదో తరగతి.

డ్రైవర్‌ :

ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.

శ్రామిక్‌ :

10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ అర్హతగా పేర్కొన్నారు.

మరిన్ని అర్హతలు :

  • కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్, డ్రైవర్‌ పోస్టులకు శారీరక ధారుడ్య పరీక్షలు కూడా పరిశీలించనున్నారు.
  • ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటే, వాళ్లు చదవడం, రాయడాన్ని సెలక్షన్‌ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సందేహాలు ఉంటే నివృత్తి కోసం ఆ వివరాలు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
  • వికలాంగులు జూనియర్‌ పోస్టులకు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులు శ్రామిక్‌ పోస్టులకు అర్హులు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  • ఆర్టీసీలో కారుణ్యనియామకాల భర్తీకి ఆదేశాలివ్వడంపై నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేశాయి.

దరఖాస్తు కు సంబంధించిన పూర్తి వివరాలు రాగానే వెంటనే తెలియజేస్తాము.

ASRTC Notification 2023 Download :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
• 10వ తరగతి ఉద్యోగాలు
• ఇంటర్ బేస్ జాబ్స్
• ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు

డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ts govt jobs

14 thoughts on “APSRTC Recruitment 2023 Notification ఏపియస్ఆర్టీసీ నుండి కండక్టర్, డ్రైవర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top