AP Contract jobs 2023 కేవలం 10th అర్హతతో 370 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

AP Contract jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా మెడికల్ కాలేజీలు, జిల్లాలోని ఆసుపత్రులు మరియు నర్సింగ్ కళాశాలలో ఖాళీగా గల 370 ఉద్యోగాలను ఎంపిక చేయుటకు గాను భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 59 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులు, 110 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు, 24 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 19 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, 04 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 04 లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు, 04 మోర్చురీ మెకానిక్ పోస్టులను భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఒక కాంట్రాక్టు ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231124 072221

దరఖాస్తు చేయు వారు నవంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అనగా చివరి తేదిగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. 42 సంవత్సరాలు వయోపరిమితి కలిగిన వారిని మాత్రమే పరిగణలోనికి తీసుకోబడుతుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

AP Outsourcing jobs 2023 Eligibility :

ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. AP ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏ ఇతర సంస్థ నుండి అయినా బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, వారు నిర్వహించే అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్) కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ చికిత్స శిక్షణలో పురుషులు మాత్రమే అర్హత సాధించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.

మరిన్ని ఉద్యోగాలు :

ఎలెక్ట్రిషియన్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి డిప్లొమా మరియు ITI సర్టిఫికేట్ రెండింటినీ కలిగి ఉంటే, కోర్సులో పొందిన మార్కుల గరిష్ట శాతం పరిగణించబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 22,460/- వరకు జీతం లభిస్తుంది.

ఫార్మసీస్ట్ పోస్టుల విద్యార్హత గమనిద్దాం, గుర్తింపు పొందిన కళాశాల నుండి D.Pharma/B.Pharma ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ఉత్తీర్ణత. తప్పనిసరిగా A.P ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి D.Pharma మరియు B.Pharma రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది.

అప్లై లింకులు : మరిన్ని పోస్టులు, విద్యార్హతలు వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్నందు గమనించగలరు.

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

7 thoughts on “AP Contract jobs 2023 కేవలం 10th అర్హతతో 370 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment