ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 760 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | jobalertszone

Jobalertszone :

జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం, కంచరపాలెం నందు జిల్లా ఉపాధి అధికారుల ఆధ్వర్యంలో నవంబర్ 24, 2023 తేదీన శుక్రవారం ఉదయం 10.00 గంలకు భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా నందు విశాఖపట్నంలోని వివిధ సంస్థలందు గల 760 వివిధ ఖాళీల భర్తీకి ఎంపిక జరుగును. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంతో రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ తో పాటు తగు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231123 135547

హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ హైదరాబాద్ మరియు విశాఖపట్నం యూనిట్లలలో 100 జూనియర్ కెమిస్ట్ పోస్టులు, 50 జూనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ కెమిస్ట్ పోస్టులకు కెమిస్ట్రీ విభాగంలో బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ ఆఫీసర్ పోస్టులకు ఎమ్మెస్సీ (ఆర్గానిక్, ఇనార్గానిక్) కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 26సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఇందులో పొందినట్లయితే రూ 22,500/-ల జీతం మరియు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ క్యాంటీస్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు.

District Employment Office jobs 2023 :

హెచ్డిఎఫ్సి లైఫ్ విశాఖపట్నం బ్రాంచులలో 50 బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్/ సేల్స్ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. 38 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఇందులో పొందినట్లయితే రూ 15,000/-ల నుండి రూ 25,000 జీతం లభిస్తుంది.

విశాఖపట్నం శరణ్ మోటార్స్ (రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూమ్) బ్రాంచులలో 10 ఎక్జిక్యూటివ్, అడ్వైజర్, ఫ్లోర్ ఇంచార్జ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఇందులో పొందినట్లయితే రూ 12,000/-ల నుండి రూ 15,000 జీతం లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ దొండవర్తి, విశాఖపట్నం బ్రాంచులలో 80 డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10th అర్హత కలిగిన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఇందులో పొందినట్లయితే రూ 18,000/-ల నుండి రూ 30,000 జీతం లభిస్తుంది. మరిన్ని కంపెనీలు మరియు పోస్టులు పూర్తి వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలవు, వివరాలు చదివిన తరువాతనే క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 760 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | jobalertszone”

Leave a Comment