APS Bolarum Recruitment 2024 ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ నందు ఖాళీగా గల టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240103 080630

Army Public School Bolarum Vacancy 2023 :

Army Public School బోలారం నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులు ఖాళీగా కలవు.

  • పీజీటీ – 05 పోస్టులు
  • సబ్జెక్టులు – కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, పీఈటీ.
  • టీజీటీ – 30 పోస్టులు
  • సబ్జెక్టులు – హిందీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ సైన్స్, సీఎస్, పీఈటీ, సంస్కృతం, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్.
  • పీఆర్‌టీ – 16 పోస్టులు
  • సబ్జెక్టులు – అన్ని సబ్జెక్టులతో పాటు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, పీఈటీ, డ్యాన్స్, కౌన్సెలర్.
  • ప్రీ ప్రైమరీ టీచర్స్ (నర్సరీ – యూకేజీ) – 09 పోస్టులు
  • హెడ్‌ మిస్ట్రెస్‌ (ఏపీఎస్ ఆర్కేపురం ప్రీప్రైమరీ వింగ్) – 02 పోస్టులు

APS Bolarum Notification 2023 Eligibility :

వయోపరిమితి :

APS Notification 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

  • పిజిటి – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
  • టిజిటి – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
  • టిఆర్టీ – కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్/టెట్ అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
  • ప్రీ ప్రైమరీ – సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ఎన్‌ఐఓఎస్ బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు 50 శాతం మార్కులతో నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు లేదా డిప్లొమా(ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • హెడ్ మాస్టర్ – సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై స్కూల్ హెడ్‌మిస్ట్రెస్/కోఆర్డినేటర్/సూపర్‌వైజర్‌గా కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు చివరి తేదీ – జనవరి 15, 2024
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment