UIIC Recruitment 2023 బీమా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

UIIC AO Recruitment 2023

UIIC భారతదేశంలోని ప్రసిద్ధ బీమా కంపెనీలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి గొప్ప అవకాశం వచ్చింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆగస్ట్ 23, 2023 న అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230829 080348

UIIC Vacancy 2023 :

  • న్యాయ నిపుణులు – 25 పోస్టులు
  • ఖాతాలు/ఫైనాన్స్ నిపుణులు – 24 పోస్టులు
  • కంపెనీ సెక్రటరీ – 03 పోస్టులు
  • యాక్చువరీలు – 03 పోస్టులు
  • వైద్యులు – 20 పోస్టులు
  • ఇంజనీర్లు (సివిల్/ఆటోమొబైల్/మెకానికల్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ECE/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్) – 22 పోస్టులు
  • వ్యవసాయ నిపుణులు – 03 పోస్టులు

UIIC AO Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
  • EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
  • SC/ST అభ్యర్థులు : రూ 00/-

జీతభాత్యాలు :

  • UIIC నోటిఫికేషన్ ద్వారా పోస్టు సాధించినట్లైతే అభ్యర్థులు జీతం రూ 50925/- పొందుతారు.

గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ – ఆగస్టు 24, 2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

UIIC AO Recruitment 2023 Qualifications :

న్యాయ నిపుణులు :

  • న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ లేదా ప్రాక్టీసింగ్ లాయర్‌గా 3 సంవత్సరాల అనుభవం మరియు అభ్యర్థి తప్పనిసరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.

ఖాతాలు/ఫైనాన్స్ నిపుణులు :

  • చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI)/కాస్ట్ అకౌంటెంట్ (ICWA) లేదా B.Com లేదా M.Com ఉత్తీర్ణత.

కంపెనీ సెక్రటరీ :

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి .

యాక్చువరీలు :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ / యాక్చురియల్సైన్స్ లేదా ఏదైనా ఇతర క్వాంటిటేటివ్ డిసిప్లిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ / యాక్చురియల్సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ.

వైద్యులు :

  • గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి MBBS / BAMS / BHMS. అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ మెడికల్అసోసియేషన్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. MBBS డిగ్రీ కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఇంజనీర్లు :

సివిల్/ఆటోమొబైల్/మెకానికల్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ECE/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్.

వయో పరిమితి :

  • కనీస వయస్సు – 21 సంవత్సరాలు.
  • గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు.
  • ప్ర‌కారం SC, ST, OBC అభ్యర్థులకు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

Leave a Comment