SSC 10+2 CHSL ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC CHSL Recruitment Notification 2022 :

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL) ఆధ్వర్యంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ తదితర పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221216 110017
SSC CHSL Application Form 2022

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుకు ప్రారంభ తేదీ – డిసెంబర్ 08, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 04, 2023
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ – జనవరి 04, 2023
  • రాత పరీక్ష తేదీలు – తెలియజేస్తారు.
  • ఆడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్ – దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.

SSC CHSL 2022 Notification Apply Procedure :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

SSC CHSL Vacancy 2022 :

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (LDC)
  • జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (DEO)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (Grade A)
  • మొత్తం ఖాళీీలు – 4,500
SSC CHSL Recruitment 2022 Eligibility Criteria :

వయస్సు :

  • 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు
  • దివ్యాంగులకు – 10 సంవత్సరాలు గరిష్ఠ సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పూర్తి చేసిన వారు కూడా అర్హులవుతారు.
  • కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

జీత భత్యాలు :

  • LDC, JSA పోస్టులు – రూ 19,900/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌(DEO) – రూ 25,500/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌ – ఎ) – రూ 29,200/-

ఎంపిక విధానం :

  • రాతపరీక్షలు ( టైర్‌-1, టైర్‌-2 ).
  • ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ (లేదా) టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.
  • ఇది కేవలం అర్హత పరీక్ష.

రాత పరీక్ష విధానం :

  • రాత పరీక్ష మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 100 మార్కులకు గానూ 60 నిమిషాల సమయంలో జరుగుతుంది.
  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 50 మార్కులు
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 50 మార్కులు

AP & TS రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు :

  • తిరుపతి, గుంటూరు,
  • రాజమండ్రి, వరంగల్,
  • కాకినాడ, కరీంనగర్,
  • కర్నూలు, నెల్లూరు,
  • విజయనగరం, చీరాల,
  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
SSC CHSL 2022 Online Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “SSC 10+2 CHSL ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 4500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment