AAI SR Recruitment 2023 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AAI SR Recruitment 2023 :

AAI ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాలలో ఖాళీగా గల జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20231223 152329

AAI Southern Notification 2023 :

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులు ఖాళీగా కలవు.

  • జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) – 73 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) – 02 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) – 25 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్‌) – 19 పోస్టులు

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

మరిన్ని ఉద్యోగాలు :

అర్హతలు :

AAI Notification 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AAI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణత మరియు మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మీడియం వెహికల్ లైసెన్స్ (ప్రకటన తేదీకి కనీసం ఒక సంవత్సరం ముందు జారీ చేయబడింది) లేదా లైట్ మోటార్ వెహికల్ (ఎల్‌ఎమ్‌వి) లైసెన్స్ (జారీ చేయబడింది) ప్రకటన తేదీకి కనీసం రెండు సంవత్సరాల ముందు)

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్ (డిసెంబర్ 27వ తేదీ నుండి మొదలవుతుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment