DSSSB Recruitment 2023 జైళ్లశాఖలో సంక్షేమ అధికారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DSSSB Recruitment 2023 :

DSSSB ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఢిల్లీ అనగానే మనకు కాదు అనుకుంటారేమో కాదండి, ఇదొక కేంద్రప్రభుత్వ బోర్డు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా జైళ్ల శాఖలోని ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231207 173102

DSSSB Notification 2023 Apply Online & Eligibility :

ఇందులో భాగంగా 80 జైల్ సంక్షేమ అధికారి పోస్టులను, భర్తీ చేయనున్నారు.

DSSSB Notification 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. DSSSB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

జైల్ సంక్షేమ అధికారి పోస్టులకు దరఖాస్తు చేయువారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషలజీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా క్రిమినల్ విభాగంలో లేదా సోషల్ వర్క్ నందు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. అప్లికేషన్ రుసుముగా జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ 100/- చెల్లించాలి. మిగితా వారికి ఎటువంటి ఫీజు లేదు.

అప్లై లింకులు :

అప్లై ఆన్ లైన్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment