AP Govt Jobs 2023 కేవలం 10th అర్హతతో రాతపరీక్ష లేకుండానే సొంత గ్రామలలోనే 5900 ఉద్యోగాలు భర్తీ

AP Govt Jobs 2023 :

రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత గ్రామలాలలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగానే దాదాపు 4,007 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికారులు భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జిల్లాల వారి అంగన్వాడీ నోటిఫికేషన్లను గమనిద్దాం.

Visakhapatnam Anganwadi Recruitment 2023

విశాఖపట్నం జిల్లాలోని 04 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ – 05 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – వచ్చే నెల 03, 2023
  • నోటిఫికేషన్ – క్లిక్ హియర్
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

YSR Kadapa Anganwadi Recruitment 2023

వైయస్సార్ కడప జిల్లాలోని 13 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 71 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ – 18 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 49 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్కర్ – 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

Vizianagaram Anganwadi Recruitment 2023

విజయనగరం జిల్లాలోని 14 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ – 10 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 53 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్కర్ – 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Anganwadi Notification 2023 Application Form :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • అకడమిక్‌ మెరిట్
  • డాక్యుమెంట్ వేరిఫికేషన్