AP రిజిస్టార్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Group 1 Recruitment 2023 :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున అన్ని జిల్లాల స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231208 191429

శాఖల వారీగా గమనిస్తే 06 రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ పోస్టులు, 09 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 18 ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు, 26 డీఎస్పీ (సివిల్) పోస్టులు, 05 కోఆపరేటివ్ సర్వీసెస్ నందు డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు, 04 జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పోస్టులు, 03 జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు, 03 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు, 02 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి.

అప్లై చేయు విధానం :

దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 360/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 110/-

మరిన్ని ఉద్యోగాలు :

వయోపరిమితి :

APPSC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • ప్రిలిమినరి రాత పరీక్ష
  • రాత పరీక్ష (మెయిన్స్)

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment