Library jobs 2024 లైబ్రరీలలో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Library jobs 2024 :

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వారు ICMR NIN Recruitment 2024 పేరుతో లైబ్రరీ క్లర్క్ లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ NIN యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

NIN Recruitment 2024 :

NIN నందు ఖాళీగా గల 15 పోస్టుల భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే లైబ్రరీ విభాగంలో 01 పోస్టు, అప్పర్ డివిజనల్ క్లర్క్ విభాగంలో 07 పోస్టులు, లోయర్ డివిజనల్ క్లార్క్ విభాగంలో 06 పోస్టులు అలానే 01 ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు.

Clerk jobs 2024 Qualifications :

NIN Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NIN నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి పోస్టును బట్టి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నందు ఇంగ్లీషులో 35 wpm లేదా హిందీలో 30 wpm టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి. లైబ్రరీ క్లర్క్ పోస్టుకు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి తత్సమానం ప్రాధాన్యత 10+2 లేదా 12వ తరగతి. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లైబ్రరీలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక రెండు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత పోస్టును బట్టి టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

మరిన్ని ఉద్యోగాలు :

ICMR NIN Clerk Recruitment 2024 Apply Online :
  1. NIN Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

NIN నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అలానే మిగితా అభ్యర్ధులు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 05, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 26, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Library jobs 2024

Leave a Comment