APGVB Recruitment 2024 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APGVB Recruitment 2024 :

గ్రామ పంచాయతీ పరిధిలలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులలో ఖాళీలగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి APGVB Recruitment 2024 పేరుతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వారు భారీ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 9,995 గ్రూప్‌ – ఏ మరియు గ్రూప్‌ – బీ విభాగంలో గల మల్టీ పర్సస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ IBPS యొక్క అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

IBPS RRB Vacancy 2024 :

తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రామీణ బ్యాంకులలోని ఖాళీలు గమనించినట్లైతే కడప కేంద్రంగా గల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు 100 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంక్ నందు 285 పోస్టులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు 50 పోస్టులు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నందు 135 పోస్టులను భర్తీ చేయనున్నారు.

APBVB Recruitment 2024 Qualifications :

APGVB Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APGVB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28, 30, 32, 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తు దారులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), LLB పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక నాలుగు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్జామినేషన్ ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

IBPS RRB Recruitment 2024 Apply Online Process :
  1. IBPS Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

IBPS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 850/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు రూ 175/- ల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 07, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 27, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
apgvb recruitment 2024

1 thought on “APGVB Recruitment 2024 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment