Outsourcing jobs 2024 :
BECIL ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ ఆసుపత్రిలో Outsourcing jobs 2024 ఖాళీగా గల అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, తదితర ఉద్యోగాలను భర్తీకి చేయుటకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారికి సువర్ణావకాశంగా భావించవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ విభాగం నందు అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ను BECIL యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
BECIL Vacancy 2024 :
BECIL నుండి మొత్తం 1683 వివిధ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగం నందు 100 పోస్టులు, 145 మల్టిటాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు, 02 ల్యాబ్ అటెండర్ పోస్టులు, 02 డ్రైవర్, 15 ఫార్మాసిస్ట్ పోస్టులు, 37 ఓటి టెక్నాలాగిస్ట్, తదితర ఖాళీలు కలవు.
BECIL Outsoursing jobs 2024 Eligibility :
BECIL Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. BECIL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
MTS పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు బియస్సి లేదా BA లేదా B.Com లలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. Driver పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు Nextwave మంచి నోటిఫికేషన్ విడుదల
BECIL Notification 2024 Apply online :
- BECIL Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, BECIL యొక్క అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- Careers బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
BECIL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 29, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 12, 2024
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I am interesting work